సాలూరులో వైభవంగా సీతారాముల తిరువీధి మహోత్సవం

సాలూరులో శ్రీ సీతారాముల నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది. శనివారం ఉదయం పెద కోమటి పేటలోని సీతారాముల మందిరంలో మహా సామ్రాజ్య పట్టాభిషేకం, చక్రస్నానం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ అనంతరం, సాయంత్రం ఉత్సవమూర్తులను మేళతాళాలు, బాణాసంచాల హోరుతో, పెదకోమటి కోలాటాల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, పట్టణ వీధుల్లో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్