మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక తనిఖీలు

జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో రైళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఐజీపీ ఏకే రవి కృష్ణ, ఈగల్ ఎస్పీల ఆదేశాల మేరకు సోమవారం సంయుక్త బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి. రాయగడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో సీతానగరం పోలీసులు, సీసీఎస్, జీఆర్‌పీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం కలిసి పార్వతీపురం నుంచి గజపతినగరం వరకు ప్రయాణికుల సామగ్రి, రైలు బోగీలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో ఎలాంటి మత్తు పదార్థాలు లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. అక్రమ రవాణాపై రైళ్లు, బస్సులు తదితర ప్రజా రవాణా మార్గాల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్