మన్యం జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జిల్లాలో పర్యాటక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ గురించి వివరించారు. జిల్లాలో 7.42 శాతం వ్యవసాయ వృద్ధిరేటు సాధించినట్లు, 7 కొత్త జలపాతాలను పర్యాటకానికి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని సీఎంను ఆహ్వానించగా, ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సీఎం సూచించారు.

సంబంధిత పోస్ట్