కల్యాణ వేంకటేశ్వర స్వామి శతాబ్ది ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పార్వతీపురం గురువారం రాత్రి జరిగిన ఆధ్యాత్మిక సభలో మహా విద్యానంద గిరి మాతాజీ ప్రసంగిస్తూ, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, భగవంతుని నిరంతరం ఆరాధించాలని సూచించారు. సృష్టిలో ప్రతి ఒక్కరూ దైవసేవలో ఉండాలని, ధర్మాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని తెలిపారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మాతాజీని సన్మానించారు.