ఘనంగా శ్రీ పోలమాంబ అనుపోత్సవం

ఉత్తరాంధ్రుల వేల్పు, గిరిజనుల ఆరాధ్య దైవం శంబర శ్రీ పోలమాంబ జాతర మహోత్సవంలో భాగంగా బుధవారం అనుపోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి అమ్మవారి ఘటాలతో తిరువీధి కార్యక్రమం నిర్వహించగా, బుధవారం విశ్రాంతి గద్దెకు చేరుకున్నారు. డప్పులు, మేళతాళాలు, కోలాటాల మధ్య ఉయ్యాల కంబాల కార్యక్రమం జరిగింది. అనంతరం ఘటాన్ని వనం గుడి వరకు తీసుకెళ్లి ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి మొక్కుబడులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్