మన్యం జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి డా. కె. శ్రీధర్ రావు తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 14 నుంచి 29 వరకు రాష్ట్ర స్థాయి మాస్టర్స్ క్రీడా పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలలో అథ్లెటిక్స్ (మార్చి 14, 15 తేదీలలో గుంటూరులో 40 ఏళ్లు పైబడిన వారికి), బాడ్మింటన్ (మార్చి 21, 22 తేదీలలో కోనసీమలో 35/45 ఏళ్లు వారికి), టెన్నిస్ (మార్చి 28, 29 తేదీలలో విజయనగరంలో 35/45 ఏళ్లు వారికి) ఉంటాయి. పార్వతీపురం మన్యం జిల్లా వాసులు మాత్రమే ఈ పోటీలకు అర్హులు. ఆసక్తిగలవారు శాప్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 7396423490 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.