పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం వైకేఎం కాలనీ శివారులో ఆక్రమణకు గురైన కాలువ, చప్టాను పరిశీలించారు. కాలువ ఆక్రమణతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనుమతులు లేకుండా భవనాలు నిర్మించిన వారిపై, అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు తోడుగా ఉంటుందని తెలిపారు.