పార్వతీపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్ల నియామక పత్రాలను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు జిల్లా ఎన్నికల అధికారికి అందజేశారు. జూన్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యే ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్)లో బూత్ ఏజెంట్ల పాత్ర కీలకమని, పార్టీ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోల సత్యనారాయణ, కొండపల్లి బాలకృష్ణ, మజ్జి శేఖర్, దేవుపల్లి నాగరాజు, ఎస్ చంద్రరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.