సీతానగరం మండలంలో కొత్త ఎంపీడీవోగా సుగుణాకరరావు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గజపతినగరం మండల పరిషత్‌లో డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేసిన ఆయన పదోన్నతితో సీతానగరానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సుగుణాకరరావు మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం సిబ్బంది సహకారంతో కృషి చేస్తానన్నారు. అనంతరం మండల సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.