మన్యం జిల్లా పాలకొండ మండలం బుక్కూరు గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ జామి విఠల్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. మంగళవారం ఇంట్లో విఠల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇటీవలే వివాహం జరిగిన ఆయన భార్య పుట్టింట్లో ఉండగా ఒంటరిగా ఉన్నట్లు సమాచారం. తలపై ఉన్న గాయాలు మరణంపై అనుమానాలు రేకెత్తించాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.