ప్రతి వివాహానికి తహసీల్దార్ అనుమతి తప్పనిసరి

మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి బాల్య వివాహాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో, బాల్య వివాహాలు జరిపితే తప్పనిసరిగా FIR నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి వివాహానికి తహసీల్దార్ అనుమతి తప్పనిసరి అని, అనుమతులు లేకుండా సహకరించిన ప్రింటింగ్ ప్రెస్‌లు, ఫంక్షన్ హాల్స్, కేటరింగ్, డెకరేషన్ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వివాహానికి వయసు నిర్ధారణ పత్రం తప్పనిసరిగా ఉండాలని, బాల్య వివాహాల నివారణకు CDPO, ANM, ఆశా కార్యకర్తలు కృషి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్