సాలూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆదివారం ఘనంగా వేడుకలు జరిగాయి. పార్టీ కార్యాలయం నుండి తహశీల్దార్ ఆఫీస్ జంక్షన్ వరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం, తహశీల్దార్ ఆఫీస్ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను మంత్రి సన్మానించారు.

సంబంధిత పోస్ట్