కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. మే డే సందర్భంగా సన్మానం

పార్వతీపురంలో మే డే సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో కార్మికులను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సన్మానించారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు అండగా నిలుస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మిక హక్కులకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన తెలిపారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు ఆహారం అందిస్తున్నామని, కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని, మున్సిపల్, కార్పొరేషన్ కార్మికులకు వేతనాలు పెంచేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. అనంతరం కార్మికులకు భోజనాలు వడ్డించి మే డే శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్