వంగర మండలంలోని పాఠశాలల మౌలిక సదుపాయాలు కల్పన నామ మాత్రంగా కొనసాగుతున్నాయి. నాడు-నేడు 2వ విడతలో 12 పాఠశాలకు అదనపు తరగతులు, మౌలిక వసతులు కోసం రూ 2. 93 కోట్లు మంజూరు చేయగా రూ. 92లక్షలు మాత్రమే విడుదలైందని MEO జగదీశ్వరి తెలిపారు. MSR పురం, కొప్పర, వంగర, మరువాడ, యూకే గుమ్మడ, కోనింగిపాడు, దేవకివాడ కాలనీ, పాఠశాలల విద్యార్థులు వరండాలోనే చదువుతున్నారు. సిమెంట్‌ను మంజూరు చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.