మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న జలధార పనులన్నింటినీ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని, 100 రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులకు ఇప్పటికే 60 రోజులు గడిచిపోయాయని గుర్తుచేశారు. ప్రారంభం కాని పనులను వెంటనే చేపట్టి, మంజూరైన పనులన్నీ శతశాతం పూర్తి చేయాలని, పనుల నాణ్యతలో రాజీ పడవద్దని, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణతో పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటిడిఏ, ఇరిగేషన్, డ్వామా, అటవీ, భూగర్భ జల శాఖ అధికారులు పాల్గొన్నారు.