ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా: ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర

పార్వతీపురం మన్యం జిల్లాలో, ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను UTF నాయకులు శనివారం కలిసి ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆర్థిక బకాయిల చెల్లింపునకు పరిష్కారం చూపాలని వినతిపత్రం అందించారు. ఫిబ్రవరి 11వ తేదీ నుండి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక అంశాలపై ప్రత్యేకంగా చర్చించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయ సమస్యలపై ప్రస్తావిస్తానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్