జర్నలిస్టుపై హత్యాయత్నం: రాజాంలో నిరసనలు

విజయనగరం జిల్లా రాజాంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నాన్ని ఖండిస్తూ జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పని, భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ తాహశీల్దార్ రాజశేఖర్ కు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్