రాజాం మండలం గార్రాజు చీపురుపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కోడూరు రాము (35) శనివారం రాజయ్యపేట సమీపంలోని తోటపల్లి కాలువ వద్ద చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందారు. ఘటన స్థలంలో అతని ఆటోను పోలీసులు గుర్తించారు. రాజాం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాముకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.