రేగిడి మండలం వండానిపేటలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణ ఘటనను దృష్టిలో పెట్టుకుని ఇరుపార్టీలకు చెందిన 25 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఈనెల 11న జరిగిన కొట్లాట తర్వాత శాంతిభద్రతల పరిరక్షణ కోసం చర్యలు తీసుకున్నట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. వైసీపీకి చెందిన వియ్యపు చక్రపాణితో పాటు 13 మంది, టీడీపీకి చెందిన ముంజేటి పురుషోత్తంతో పాటు 12 మందిని లక్ష రూపాయల పూచీకత్తుపై విడుదల చేశారు. మరికొందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.