యువకుల మధ్య ఘర్షణ

రాజాంలోని బొబ్బిలి సెంటర్‌లో ఆదివారం సాయంత్రం యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వారిని కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణలో అడ్డొచ్చిన ఒక మహిళకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అక్కడున్న వారిని చెదరగొట్టి పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్