దోమల వలన వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. వంగరలో మురికినీరు, ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని పరిశీలించి, దోమల లార్వాను గుర్తించి నిర్మూలించారు. అనంతరం స్థానికులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నట్లు విశాలాక్షి తెలిపారు.