విజయనగరం జిల్లా వంగర మండలంలోని మడ్డువలస జలాశయానికి గురువారం నాడు సువర్ణముఖి, వేగావతి నదుల ద్వారా సుమారు 24,600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, అధికారులు ఎనిమిది ప్రధాన గేట్లను తెరిచి నాగావళి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఈఈ అర్జున్ సూచించారు.