హోంజరం పాఠశాల విద్యార్థులకు ఐఐటీలో సీట్లు: సంతోషంలో గ్రామస్తులు

సంతకవిటి మండలం హోంజరం పాఠశాలలో 10వ తరగతి చదివిన ముగ్గురు విద్యార్థులు ఐఐటీలో ప్రవేశాలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రధాన ఉపాధ్యాయురాలు వై. లక్ష్మి శనివారం తెలిపారు. వీరిలో నూజివీడుకు ఒకరు, శ్రీకాకుళంకు ఇద్దరు ఎంపికయ్యారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. విద్యార్థుల ప్రతిభ పట్ల గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్