చంద్రగ్రహణం కారణంగా మంగళవారం రాజాంలో ఆలయాలను అధికారులు, అర్చకులు తాత్కాలికంగా మూసివేశారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.47 గంటలకు ముగిసే గ్రహణ కాలంలో, ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం భక్తులకు ప్రవేశాన్ని నిషేధించారు. గ్రహణం విడిచిన అనంతరం ఆలయాలను శుద్ధి చేసి, సంప్రోక్షణ తర్వాతే భక్తులను అనుమతిస్తారు.