రేగిడి మండలం వావిలవలస లో రాహుల్ సౌరబ్ నిత్య అన్నదాన సత్రములో ఉన్న నిరుపేదలకు మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఔదార్యాన్ని చాటుకున్నారు. సత్రంలో ఉన్న అనాధలకు ఒడిసా రాష్ట్రంలోని రాయిఘడ మజ్జి గౌరమ్మ అమ్మవారిని దర్శనానికి వెళ్లేందుకు అవసరమైన సహాయ సహకారాలు ఎస్పీ గురువారం అందించారు. దేవస్థానం పర్యటనలో భోజనాలు, ఇతర ఖర్చులకు ఎస్పీ సాయం చేశారు. సామాజిక కార్యకర్త పాలూరు సిద్ధార్థ తెలిపారు. ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.