రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం (నేడు) రాజాం రానున్నారు. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల పర్యటన ముగించుకుని ఈ నెల 29 రాత్రి రోడ్డు మార్గంలో రాజాం చేరుకుని, తృప్తి రిసార్ట్స్‌లో బస చేయనున్నారు. ఈ నెల 30న పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గంలో విశాఖపట్నం బయలుదేరనున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు అధికారిక సమాచారం అందినట్లు తెలిసింది.