రాజాంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి క్యూలలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ ఉన్న చోట్ల క్యాన్లు పెట్టి ఎదురుచూస్తున్నారు. డీజిల్ లభించక ఆటోలు, భారీ వాహనాలు నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈ పరిస్థితిపై వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.