వంగర మండల వ్యాప్తంగా కొత్తగా స్పౌజ్ పెన్షన్ మంజూరు

వంగర మండల వ్యాప్తంగా పెన్షన్ పొందుతూ భర్త మరణించిన వారికి ఇచ్చే స్పాజ్ పెన్షన్లు 110 మంజూరయ్యాయని ఎంపీడీవో ఎస్ రఘునాథ చారి తెలిపారు. పెన్షన్ పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలోని 19 గ్రామ సచివాలయాల్లో 6390 మంది పెన్షన్ దారులకు రూ. 2, 71, 10500 పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం  ఉదయం నుంచి ఇంటి వద్దనే లబ్ధిదారులకు పెన్షన్ అందజేయాలని సిబ్బందికి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్