విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొండ్రు సురవరం, మండవకురిటి గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటిసారి వృద్ధాప్య, వితంతు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా అత్యధిక పింఛన్లను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొల్ల అప్పలనాయుడు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.