రేగిడి ఆమదాలవలస మండలం కాగితాపల్లి గ్రామం సమీపంలో ఆదివారం రాత్రి భారీ కొండచిలువ కనిపించింది. కోళ్ల ఫారం వద్ద సంచరిస్తున్న ఈ పామును ఫారం యజమాని గుర్తించి, స్నేక్ క్యాచర్ రమణయ్యకు సమాచారం అందించారు. రమణయ్య వెంటనే అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని, సురక్షిత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.