రాజాం: ఇరువర్గాల మధ్య ఘర్షణ 8 మందికి గాయాలు

రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 8 మందికి గాయాలైన ఘటన రాజాం మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని బుచ్చంపేట గ్రామంలో ఓ స్థలం విషయంలో 2 వర్గాల మధ్య వాగ్వాదం కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ  దాడిలో 8 మందికి గాయాలు కాగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్