రాజాం నియోజకవర్గం వంగర మండలం నీలయ్యవలసకు చెందిన బెజ్జిపురం రవిబాబు శివ్వాం పిఎసిఎస్ సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు శనివారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్, తన సహోదరుడు జగదీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి పేరు తెచ్చేలా కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు.