సంతకవిటి: సంక్రాంతికి సొంత ఊరికి వస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి

శుక్రవారం సిరిపూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ రన్నింగ్ సమయంలో దిగుతుండగా ప్రమాదవశాత్తు రైలు కిందపడి సంతకవిటి మండలం సోమన్నపేటకు చెందిన బూరాడ బుజంగారావు అనే వలస కూలీ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మహరాష్ట్రలో పనిచేస్తున్న బుజంగారావు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్