రాజాంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండల కేంద్రంలో టిడిపి సీనియర్ నాయకులు, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొల్ల అప్పలనాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి యుగపురుషుడు నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. సంతకవిటి మండల టిడిపి అధ్యక్షులు గట్టి భాను పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్