పెళ్లి వేడుకలో విషాదం.. కరెంట్ షాక్‌కు అన్నయ్య మృతి

సంతకవిటి మండలం మిర్తివలస గ్రామంలో తమ్ముడి వివాహ ఏర్పాట్లు జరుగుతుండగా, అన్నయ్య పొన్నాడ సతీశ్ (32) కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సతీశ్, పెళ్లి కోసం స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం వేకువజామున ఇంట్లో విద్యుత్ తీగ తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్