వంగర: మండలంలో దంచి కొట్టిన వర్షం

వంగర మండలంలో గత వారం రోజులుగా ఎండలు పెట్టగా సోమవారం కూడా ఉదయం నుండి పెట్టిన ఎండకు గ్రామంలో ప్రజలు తల్లడిల్లి పోయారు. సాయంత్రం 6: 30 గం ప్రాంతంలో ఉన్నట్టుండి మబ్బులు పట్టి ఒక గంట పాటు వర్షం దంచి కొట్టింది. ఈ వర్షంతో ఎండిన ఆకునారు మడు లుకు జీవం వచ్చిందని వంగర, మడ్డువలస, శ్రీహరిపురం భాగ్యంపేట, నిలయ్యావలస, అరసాడ, పలు ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది.

సంబంధిత పోస్ట్