వంగర: వీధి కుక్కల బెడద

వంగర మండలములో వంగర, మగ్గూరు, పట్టు వర్ధనం, నీలయ్య వలస, మడ్డువలస అరసాడ పలు గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ వాహనదారుల పైన నడిచి వెళ్ళిన వారి పైన విచక్షణ రహితంగా దాడి చేస్తున్నాయి. ఈ ఏడాది 7 నెలల్లో 265 మంది కుక్క కాటుకి గురయినారని పీహెచ్సీ సిబ్బంది గురువారం నాడు తెలిపారు. ప్రతిరోజు మండలంలో వీధి కుక్కల బారిన పడినవారు ఆసుపత్రికి వస్తూనే ఉన్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి కాపాడాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్