ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీల్లో తప్పులు ఉండటం వల్ల అర్హత ఉన్నప్పటికీ కొదమ, పగులు చెన్నూరు, సారిక గ్రామాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ పింఛన్లకు దూరమవుతున్నారు. ఏళ్ల తరబడి దరఖాస్తులు చేస్తున్నా, ఆధార్ సవరణల కోసం తిరుగుతున్నా ఫలితం లేక వృద్ధులు, వితంతువులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కోరుతున్నారు.