లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అంగన్వాడీల నిరసన

ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మిక సమస్యలపై నిర్వహించనున్న సమ్మెకు మద్దతుగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సాలూరు కమిటీ గురువారం ఐసిడిఎస్ పీఓ కార్యాలయానికి వినతిపత్రం అందజేసింది. లేబర్ కోడ్ల ద్వారా కార్మిక హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తున్నారని యూనియన్ నేతలు విమర్శించారు. పని గంటలు పెంచి వర్కర్లపై భారం మోపుతున్నారని తెలిపారు. కనీస వేతనం 26, 000 అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్