మెగా పేరెంట్స్ మీటింగ్ కోసం భామిని మండలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల విద్యపై కీలక ప్రకటనలు చేస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం వద్దకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.