సాలూరులో అర్హులకు ఎన్‌టీఆర్ పింఛన్ల పంపిణీ

సాలూరు మున్సిపాలిటీ 11వ వార్డులో సోమవారం అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ, మహిళా, శిశు అభివృద్ధి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. సాలూరు నియోజకవర్గంలో 38, మున్సిపాలిటీ పరిధిలో 12 కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు చేరేలా పనిచేస్తామని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్