గంజాకు గుడ్‌బై.. మాదకద్రవ్యాల వ్యతిరేకంగా భారీ సైకిల్ యాత్ర

మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో 'అభ్యుదయం సైకిల్ యాత్ర' మూడవ రోజు సాలూరు నుండి మామిడిపల్లి, మక్కువ వరకు విజయవంతంగా కొనసాగింది. ఈ యాత్రలో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నినదించారు. అవగాహన సభల్లో అధికారులు ప్రసంగించి, ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల సమాచారం తెలిస్తే 1972 లేదా 100/112 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం యాత్ర మక్కువ నుండి ముందుకు సాగుతుంది.

సంబంధిత పోస్ట్