వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మక్కువ ఎరువాకలో మంత్రి

వ్యవసాయాభివృద్ధే లక్ష్యమని, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు త్వరలో రూ. 20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మక్కువలో ఎరువాక కార్యక్రమంలో కలెక్టర్‌తో కలిసి పాల్గొన్న ఆమె, ఎస్టీ రైతులకు 90%, బీసీ రైతులకు 50% సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, పరికరాలు అందిస్తున్నట్లు చెప్పారు. సేంద్రియ, చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. రైతులకు అవసరమైన ఎరువులు ముందుగానే అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్