గురువారం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికి, పూల బొకే అందజేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రులను ఘనంగా పలకరించారు.