పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

సాలూరు పట్టణం డబ్బివీధి కేఎచ్ పాఠశాలలో మంత్రి సంధ్యారాణి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 49.20 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. మన్యం జిల్లాలో లక్ష మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించనున్నారు. మంత్రి స్వయంగా చిన్నారులకు చుక్కలు వేసి, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజానికి ఈ కార్యక్రమం కీలకమని తెలిపారు.

సంబంధిత పోస్ట్