మాజీ సీఎం వైఎస్ జగన్ ఏజెన్సీ ప్రాంత వసతిగృహాల్లో విద్యార్థినుల మరణాలపై చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గురువారం ఘాటుగా ప్రతిస్పందించారు. 2023లో వైసీపీ పాలనలోనే 66 మంది గిరిజన విద్యార్థులు మరణించారని, అప్పుడు స్పందించని వారు ఇప్పుడు విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమని ఆమె అన్నారు. గిరిజన విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యం చేయబడ్డాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటోందని సంధ్యారాణి తెలిపారు.