శ్రీ గంగమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న రాజన్నదొర

మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి పర్వదినాన సాలూరు మండలం మావుడి గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన సంప్రదాయ మేళవాయిద్యాలతో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్