రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్ఠ పర్చాలని, నిధులు పెంచి బలోపేతం చెయ్యాలని ఏపి మధ్యాహ్న భోజన పథకం సంఘం నాయకులు డిమాండ్ చేసారు. గురువారం సాలూరు పట్టణ లైన్స్ ఇంగ్లీషు మీడియం స్కూల్ ఆవరణలో ఆ సంఘం అధ్యక్షులు చొక్కాపు సుశీల అధ్యక్షతన సమావేశంలో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు వెట్టి చాకిరి చేస్తున్నారని, వీరికి సకాలంలో వేతనం, పోపు బిల్లులు చెల్లించటం లేదన్నారు.