సాలూరు పట్టణ ఎరువులు, పురుగు మందుల షాపుల పై సోమవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం నుండి వచ్చిన విజిలెన్స్ అధికారుల బృందం మండల వ్యవసాయ శాఖ అధికారి కల్లేపల్లి శిరీష ఇతర సిబ్బందితో కలిసి పట్టణంలో ఉన్న ట్రేడర్లలో రికార్డులు, ఎరువులు, పురుగుల మందులు (పెస్టిసైడ్లు) ను తనిఖీ చేశారు. మొక్కల ఎదుగుదలకు సంబంధించిన రసాయనాలను అనుమతి లేకుండా అమ్మడాన్ని గుర్తించారు.