సంక్షేమ పథకాల అమల్లో పార్టీలను చూడమని, అర్హులందరికీ పథకాలు అందించటమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం సాలూరు మండలం కొట్టు పరువు పంచాయితీ బూర్జ వలసలో జరిగిన ఇంటింటికి టీడీపీ, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట తమ పార్టీ శ్రేణులతో కలిసి టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మరో 10రోజుల్లో రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు అందుతాయన్నారు.